calender_icon.png 22 December, 2024 | 5:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

15-10-2024 12:45:47 AM

ఘట్‌కేసర్, అక్టోబర్ 14: గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఘట్‌కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ పరశురాం తెలి పిన వివరాలు.. ఘట్‌కేసర్ సమీపంలోని కొండాపూర్ ఇండియన్ పెట్రో ల్ బంక్ వద్ద సోమవారం ఉదయం బైక్‌పై వెళ్తున్న ఇంద్రనీల్ గౌడ్ (31)ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టంది.

ప్రమాదంలో అతడికి తీవ్రగాయాలు కావటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ఆదిలాబాద్ జిల్లా  విగాన్ గ్రామానికి చెందినవాడిగా గుర్తించామని, అవుషాపూర్‌లోని తీన్మార్ హోటల్‌లో కొంత కాలంగా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘట్‌కేసర్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు చెప్పారు. కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.