కామారెడ్డి, అక్టోబర్ 5 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నాగిరెడ్డి పేట మండలం తాండూర్ గ్రామాని కి చెందిన పల్లె పద్మారావు(43) నీటి కుంటలో పడి మృతిచెందినట్లు ఎస్సై మల్లారెడ్డి తెలిపారు. కొన్ని రోజు ల క్రితం పద్మారావు ఇంటి నుంచి వెళ్లి రాకపోవడంతో కుటుంబ సభ్యు లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం తాండూర్ గ్రా మంలోని నీటి కుంటలో విగత జీవిగా లభించాడు.