calender_icon.png 8 January, 2025 | 5:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మద్యం మత్తులో పురుగుల మందు తాగి వ్యక్తి మృతి

06-01-2025 07:10:05 PM

మణుగూరు (విజయక్రాంతి): మద్యం మత్తులో పురుగుల మందు తాగిన వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రేగాళ్ళ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రేగాళ్ల గ్రామానికి చెందిన పాయం సతీష్ కుమార్ (28) మద్యం మత్తులో పురుగుల మందు తాగి కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మరణించాడు. మృతుడు తండ్రి పాయం పుల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజేందర్ తెలిపారు.