calender_icon.png 11 January, 2025 | 12:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రావెల్ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

16-09-2024 12:00:00 AM

చేగుంట, సెప్టెంబర్ 15: చేగుంట మండలం నడిపితండాకు చెందిన మెగావత్ రమేశ్(34) ఆదివారం మాసాయిపేట శివారులోని చెట్ల తిమ్మాయిపల్లి వద్ద జాతీయ రహదారిపై రోడ్డు దాటుతుండగా నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపు రాయల్ ట్రావెల్ బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ రమేశ్‌ను కొంపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. రమేశ్ భార్య దేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చేగుంట పోలీసులు తెలిపారు.