బెల్లంపల్లి, నవంబర్ 19 (విజయకాంతి) : ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొని వ్యక్తి మృతిచెందిన ఘటన బెల్లంపల్లిలో చోటుచేసుకున్నది. రైల్వే పోలీసుల కథనం మేరకు.. గంగారాంనగర్ ప్రాంతానికి చెందిన తిప్పరవేణి శ్రీను(45) మంగళవారం కన్నాలబస్తీలో ఉండే తన బంధువుల ఇంటికి వెళ్తున్నాడు. ఈక్రమంలో ట్రాక్ దాటుతుండగా ప్రమాదవశాత్తు గూడ్స్ రైలు ఢీకొని మృతిచెందాడు. కూలి పనిచేస్తూ జీవనం సాగిస్తున్న శ్రీనుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్టు స్థానికులు తెలిపారు. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.