02-04-2025 10:31:07 PM
ముసాపేట: మూసాపేట మండలం కొమ్మి రెడ్డిపల్లి గ్రామం శివారులో మంగళవారం రాత్రి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. ఎస్సై వేణు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గొల్ల భోగం శివ (31) సంవత్సరకాలంగా హైదరాబాద్ లో కూలి పని చేసుకుంటూ కుటుంబ సభ్యులతో జీవనం కొనసాగిస్తున్నాడు. ఉగాది పండుగ జరుపుకునేందుకుగాను తన సొంత గ్రామం అయిన పునకల్ గ్రామానికి కుటుంబ సభ్యులతో పాటు వచ్చాడు. మంగళవారం అవసరాల నిమిత్తం మృతుడి అమ్మతో గొడవపడి మనస్థాపన చెందినట్లు తెలుస్తుంది. ఓ చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య పద్మ, మృతునికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృతుని భార్య పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వేణు తెలిపారు.