calender_icon.png 4 December, 2024 | 2:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాణాసంచా విక్రయాలకు అనుమతి తప్పనిసరి : సిఐ

27-10-2024 12:35:12 PM

ఇల్లందు: దీపావళికి భద్రతా ప్రమాణాలు పాటించాలని, ప్రజల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రాబోయే దీపావళిని ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని, బాణాసంచా విక్రయాలకు అనుమతి తప్పనిసరని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సిఐ బత్తుల సత్యనారాయణ తెలిపారు. అనుమతులు లేకుండా బాణాసంచా దుకాణాలను ఏర్పాటు చేస్తే ప్రేలుడు పదార్థాల చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ హెచ్చరించారు.

ఇల్లందు పట్టణ పరిసర ప్రాంత పరిధిలోని ఆయా గ్రామాలలో ఎలాంటి అనుమతులు లేకుండా బాణాసంచా దుకాణాలను ఏర్పాటు చేసిన, సరైన భద్రతా ప్రమాణాలు లేకుండా దుకాణాలు ఏర్పాటు చేసిన, విక్రయాలు జరిపిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిఐ హెచ్చరించారు. దీపావళిని పురస్కరించుకుని బాణాసంచా తయారీ, విక్రయదారులపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని, నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా విక్రయాలు జరిపితే చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని సీఐ బత్తుల సత్యనారాయణ  తెలిపారు.