18-03-2025 12:00:00 AM
రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో వచ్చిన ‘ధరణి’ అనేక సమస్యలను సృష్టించిన సంగతి తెలిసిందే. వీటివల్ల ఎన్నో కుటుంబాలు మానసిక క్షోభలను అనుభవించాయి. దాదాపు ప్రతీ కుటుంబంలోనూ భూసంబంధమైన తగాదాలు సంభవిస్తున్నాయంటే ఆశ్చర్యం లేదు. అవి ఇప్పటికీ సద్దుమణిగే పరిస్థితి కనిపించడం లేదు. భూమి గొడవలు చివరకు అల్లర్లు, హత్యలకు దారి తీస్తుండడం దురదృష్టకరం. కొత్త ప్రభుత్వం ఇప్పటికైనా ఎలాంటి సమస్యలు లేని ‘భూభారతి’ని అమలులోకి తేవాలి.
సింగు లక్ష్మీనారాయణ, కరీంనగర్