calender_icon.png 5 March, 2025 | 3:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎవరి బిడ్డ..?

04-03-2025 11:23:31 PM

బొల్లారం జగన్నాథ ఆలయం వద్ద నెల రోజుల మగ శిశువు..

సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించిన పోలీసులు..

పటాన్ చెరు: ఐడీఏ బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని జగన్నాథ స్వామి ఆలయం ఆవరణలో మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో నెల రోజుల మగ బిడ్డను వదిలి వెళ్లడం కలకలం రేపింది. ఆలయం సమీపంలోని టేబుల్ పై పాపను పడుకోబెట్టి వెళ్లగా బాబు గుక్కపట్టి ఏడుస్తుండడంతో ఆలయ సిబ్బంది, స్థానికులు గుర్తించారు. సమీపంలో...చుట్టుపక్కల  శిశువుకు సంబంధించిన వారు ఎవరు లేకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.  సీఐ రవీందర్ రెడ్డి సిబ్బందితో వచ్చి శిశువుకు సంబంధించిన వ్యక్తులు ఎవరో ఆరా తీసిన ఆచూకీ లభించలేదు. చాల సేపటి వరకు వేచి చూసి శిశువును సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. శిశువుకు సంబంధించిన వారు ఎవరైనా ఉంటే పోలీసులను సంప్రదించాలని సీఐ తెలిపారు.