calender_icon.png 17 January, 2025 | 7:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబులెన్స్‌లోనే సాధారణ ప్రసవం

17-01-2025 01:52:15 AM

అచ్చంపేట, జనవరి 16: పురిటి నొప్పులతో బాధపడుతూ ప్రసవం కోసం ఏరియా ఆసుపత్రికి వెళ్ళిన ఓ గర్భిణికి చేదు అనుభవం ఎదురయింది. గత్యంతరం లేక జిల్లా ఆసుపత్రికి అంబులెన్స్ లో వెళ్తుండగా సాధారణ ప్రసవంతో అపాయం నుంచి బయటపడింది. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే...ఉప్పునూతల మండలం పెనిమిళ్ల గ్రామానికి చెందిన అర్చన పురటి నొప్పులతో బాధపడుతూ అచ్చంపేట సివిల్ ఆసుపత్రికి వెళ్ళింది.

అక్కడి వైద్యులు తాత్కాలికంగా పరీక్షలు జరిపి పరిస్థితి విషమంగా ఉందని హైరిస్క్ కేసుగా పేర్కొంటూ జిల్లా జనరల్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. దీంతో గత్యంతరం లేక 108 అంబులెన్స్ సాయంతోనే నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రికి వెళుతుండగా పురిటి నొప్పులు మరింత అధికమ య్యాయి.

దీంతో అంబులెన్స్‌లోని ఈఎంటి ఆంజనేయులు సాధారణ కాన్పు చేయగా పండంటి బిడ్డకు జన్మని చ్చింది. ఇప్పటికీ అచ్చంపేట ప్రభు త్వాసుపత్రిలోని వైద్యుల తీరు మార్చుకోకపోవడంతో చాలామంది గర్భిణీలు,  బాలింతలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న పరిస్థితి దాపురించిందని పట్టణవాసులు మండి పడుతున్నారు. సరైన సమయంలో కాన్పు చేసిన ఈఎంటి ఆంజనేయులు పైలట్ రమేష్ లను అభినందిస్తున్నారు.