నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా అధికారుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా గౌరవ అధ్యక్షులుగా అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ అధ్యక్షులుగా జెడ్పిసిఓ గోవిందరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా జీవరత్నం, విజయలక్ష్మి, అశోక్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా కిరణ్ కుమార్, సంయుక్త, కార్యదర్శిగా శ్రీనివాస్, నర్సింహారెడ్డి, రాంగోపాల్, కోశాధికారిగా అంబాజీ నాయక్, ప్రచార కార్యదర్శిగా విష్ణు వర్ధన్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికైన నూతన కార్యవర్గాన్ని జిల్లా అధికారులు శాలువాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.