calender_icon.png 20 January, 2025 | 4:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొవిడ్ కొత్త వేరియంట్ విజృంభణ

19-09-2024 03:31:36 AM

  1. 27 దేశాలకు వ్యాప్తి చెందిన ఎక్స్‌ఈసీ రకం
  2. యూరప్‌లో మెదటి కేసు నమోదు

న్యూ ఢిల్లీ, సెప్టెంబర్ 18: కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను ఎంతగా కలవరపెట్టిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ కొవిడ్ సంబంధించిన కొత్త వేరియంట్ ఎక్స్‌ఈసీ రూపంలో వేగంగా వ్యాపిస్తోంది.  ఒమిక్రాన్ సబ్ వేరియంట్స్ నుంచి ఎక్స్‌ఈసీ ఆవిర్భవించిందని వైద్యులు తెలిపారు. ఈ యేడాది జూన్ నెలలో  మొదటగా యూరప్‌లో ఈ వేరియంట్‌ను వైద్య నిపుణులు గుర్తించారు. కాగా ఇప్పటివరకు దాదాపు 27 దేశాల్లో ఈ వైరస్ వ్యాప్తి చెందినట్లు సమాచారం. యూకే, యూఎస్, డెన్మార్క్, జర్మనీ, నెదర్లాండ్స్ దేశాలలో ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

వైరస్ సోకిన వారిలో లక్షణాలు..

ఎక్స్‌ఈసీ సోకిన వారిలో  జ్వరం, గొంతు మంట, దగ్గు, వాసన తెలియకపోవడం, ఆకలి లేకపోవడం, ఒంటినొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్‌లోని జెనెటిక్స్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఫ్రాంకోయిస్ బల్లౌక్స్ మాట్లాడుతూ.. ఇతర వైరస్‌లతో పోలిస్తే ఎక్స్‌ఈసీ ప్రభావం.. ముందస్తు టీకాలు, బూస్టర్ డోస్ తీసుకున్న వారిలో అంతగా ఉండదని తెలిపారు. అయితే శీతాకాలంలో ఈ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తిచెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఫ్రాంకోయిస్ తెలిపారు.