calender_icon.png 19 November, 2024 | 3:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓఎల్‌ఎక్స్‌లో కొత్త తరహా మోసం

19-11-2024 01:05:00 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 18 (విజయక్రాంతి): ఓఎల్‌ఎక్స్ లో కొత్త తరహా మోసానికి పాల్పడుతున్న వ్యక్తిని పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పంజాగుట్ట ఏసీపీ ఎస్ మోహన్‌కుమార్ సోమవారం వివరాలు వెల్లడించారు. తిరుపతికి చెందిన మరిసర్ల బాలాజీ నాయుడు (35) ఈజీగా మనీ సంపాదించాలని అనుకున్నా డు. ఇందుకు ఓఎల్‌ఎక్స్‌ను వేదికగా చేసుకున్నాడు.

ముందుగా ఓఎల్‌ఎక్స్‌లో ఖరీదైన మొబైళ్లను విక్రయిం చే వారి వివరాలు తెలుసుకొని వారి ని సంప్రదిస్తాడు. తాను ఆ మొబైల్ కొంటానని నమ్మించి, మొబైల్ వివరాలను ఓఎల్‌ఎక్స్ నుంచి తొల గించి తనకు పంపించాలని చెబుతాడు. అనంతరం ఆ మొబైల్ వివ రాలను తక్కువ ధరకే విక్రయిస్తానంటూ ఓఎల్‌ఎక్స్‌లో పోస్ట్ చేస్తాడు.

ఆశతో ఎవరైనా బాలాజీని సంప్రదిస్తే, వారికి ఫలానా ప్రదేశానికి రావాలని చెప్పడంతో పాటు ఆ ఫోన్ అసలు యజమానికి కూడా అదే ప్రదేశానికి రావాలని చెప్తాడు. ఈ క్రమంలో తన సోదరుడితో మొబైల్ పంపిస్తానని, డబ్బులు తాను చెప్పిన నంబర్‌కు పంపాలని బాధితుడికి సూచిస్తాడు.

తర్వాత ఫోన్ స్విచ్‌ఆఫ్ చేస్తాడు. పోలీసులకు అందిన సమాచారం మేరకు సోమవారం ఇర్రమంజిల్‌లో నిందితుడిని అదుపులో తీసుకున్నారు. నిందితుడు ఇప్పటి వరకు 200 మందిని ఈ తరహాలో రూ.౬౦ లక్షలకు పైగా మోసం చేశాడని ఏసీపీ తెలిపారు.