ఎకో, టెంపుల్, మెడికల్ టూరిజం అభివృద్ధి
ఉపాధి అవకాశాలే లక్ష్యంగా రూపకల్పన
బుద్ధ గయా తరహాలో బుద్ధవనం
పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
హైదరాబాద్, జూలై 3 (విజయక్రాంతి): ఆర్థికంగా స్వయం సమృద్ధి, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా నూతన పర్యా టక విధానాన్ని తీసుకొస్తున్నట్లు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. పర్యాటక కేంద్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దే లక్ష్యంగా ఇప్పటికే ముసాయిదాను కూడా సిద్ధం చేశామ ని, సీఎం రేవంత్‌రెడ్డి సూచనలు, సలహాల మేరకు ముందుకు సాగుతామని వెల్లడించా రు.
సచివాలయంలోని బుధవారం మాట్లాడుతూ.. గడిచిన పదేళ్లలో టూరిజం శాఖ ఉన్నదనే విషయం మరిచిపోయామని, పర్యాటకరంగ అభివృద్ధికి ఓ పాలసీ అం టూ లేకుండా పోయిందన్నారు. పర్యాటకంపై గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిం చిందని ధ్వజమెత్తారు. పర్యాటక రంగం అస్తవ్యస్తమైందని, తారామతి బరాదరి, హరిత హోటల్స్ నిర్వహణ అధ్వాన్నంగా తయారైందన్నారు. యుద్ధ ప్రాతిపాదికన పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తామని, ఆర్నెల్లలోనే పురోగతి సాధిస్తామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర నుంచి నిధులను రాబట్టడంలో గత ప్రభుత్వం విఫలమైందని విమర్శలు గుప్పించారు.
లోకల్ టు గ్లోబల్
పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయి లో తీర్చిదిద్ది, లోకల్ టు గ్లోబల్ టూరిస్ట్‌లను ఆకర్శించేలా చర్యలు తీసుకుంటున్నామన్నా రు. కృష్ణానదీ బ్యాక్ వాటర్స్‌లో సోమశిలను డెస్టినేషన్ వెడ్డింగ్, సాహస పర్యాటకానికి అనువైన ప్రదేశంగా గుర్తించామని, డెస్టినేషన్ వెడ్డింగ్‌ను ప్రమోట్ చేయడానికి రామప్ప, లక్నవరం, నాగార్జునసాగర్, అనంతగిరి హిల్స్ వంటి ముఖ్యమైన ప్రదేశాలను అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. అనంతగిరిలో వెల్నెస్ టూరిజం రిసా ర్ట్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని చెప్పారు. మన సంస్కృతి, సాంప్రదా యాలను మేళవించి వివాహ వేడుకలు నిర్వహించేలా చూస్తామన్నారు.
నాగార్జునసాగ ర్‌లోని బుద్ధవనాన్ని బుద్ధ గయా తరహాలో అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్ది తూర్పు, దక్షిణ దేశాల పర్యాటకులను అకట్టుకునేలా వసతులు కల్పిస్తామన్నారు. సంస్కృతి అంటే కేవలం కళలు, కళాకారులు మాత్రమే కాదని అది మన జీవన విధానాన్ని ప్రతిబింబిస్తుందని, పురాతన కళలను ఒక గొడుగు కిందకు తెచ్చి పేరిణి లాంటి నృత్య రూపాలను మరింత ప్రోత్సహిస్తామని తెలిపారు. దాశరథి కృష్ణమాచార్యులు శతజయంతి ఉత్సవాలు, కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని ఈ సందర్భంగా చెప్పారు.
ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో..
కాంగ్రెస్ ప్రభుత్వం పర్యాటక రంగానికి అధిక ప్రాధాన్యమిస్తోందని, ఎకో, టెంపుల్, మెడికల్ టూరిజంపై ప్రధానం గా దృష్టి సారించినట్లు మంత్రి చెప్పారు. త్వరలోనే కేంద్రమంత్రిని కలిసి పర్యాటక అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరతామని తెలిపారు. ప్రభుత్వ, -ప్రైవేట్ భాగస్వామ్యంలో పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేసి, మౌలిక వసతులు కల్పించడం ద్వారా ఆదాయం పొందే మార్గాల ను అన్వేషిస్తున్నామన్నారు. తెలంగాణ ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు, చారిత్రక వారసత్వ సంపదకు నెలవుగా ఉంద ని, ఎన్నో వనరులు ఉన్నప్పటికీ అనుకున్న స్థాయిలో పర్యాటకాన్ని అభివృద్ధి చేయలేకపోయామని, వనరులు లేని సింగపూర్, దుబాయ్, ఆఫ్రికా లాంటి దేశాలు తమ ప్రధాన ఆదాయ వనరుగా పర్యాటక రంగాన్ని మలుచుకున్నాయని పేర్కొన్నారు.