14-03-2025 12:00:00 AM
ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
హనుమకొండ, మార్చి 13 (విజయ క్రాంతి) : వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో పెరుగుతున్న జనాభా దృష్ట్యా, కొత్తగా ఏర్పాటు జరుతున్న కాలనీల కోసం నూతన పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని వరంగల్ పశ్చిమ నియోజకవ ర్గం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ ని కోరారు.
ఈ మేరకు హైదరాబాద్ మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజల భద్రత దృ ష్ట్యా శాయంపేట ,వడ్డేపల్లి పరిధిలో పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని,ట్రాఫిక్ ప్రజా రవాణా వ్యవస్థను పటిష్టం చేసేందుకు కే యూసి (కాకతీయ యూనివర్సిటీ సర్కిల్) పరిధిలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు.
వరంగల్ కమిషనరేట్ పరిధిలో నూతన పోలీస్ స్టేషన్ల ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని తెలిపారు.అందుకు సంబదించి స్థానిక శాసన సభ్యుడిగా ప్రజా అవసరాల దృష్ట్యా శాయంపేట ,వడ్డేపల్లి పరిధిలో పోలీస్ స్టేషన్, కే యు సి పరిధిలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని తన లేఖలో పేర్కొన్నారు. ఎమ్మెల్యే లేఖపై డీజీపీ సానుకూలంగా స్పందించారు.