calender_icon.png 25 November, 2024 | 1:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కులగణన పేరుతో కొత్త నాటకం

06-11-2024 01:03:25 AM

  1. రేవంత్ సర్కార్‌పై బీజేపీ ప్రధాన కార్యదర్శి కాసం ఫైర్
  2. బీసీలపై కాంగ్రెస్‌ది కపట ప్రేమ అని ఎద్దేవా

హైదరాబాద్, నవంబర్ 5 (విజయక్రాంతి): బీసీలను వెన్నుపోటు పొడిచేందుకే కులగణన సర్వే పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తనాటకానికి తెరలేపిందని బీజేపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి డా.కాసం వెంకటేశ్వర్లు విమర్శించారు.

మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ ప్రయోజనాలను రద్దు చేయడంతోపాటు సంక్షేమ పథకాలను వారికి దూరం చేసేందుకే కులగణన సర్వే నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వ పూనుకుందని మండిపడ్డారు.

ప్రజల వ్యక్తిగత వివరాలు, గోప్యతకు సంబంధించి సర్వే ప్రొఫార్మాలో ప్రశ్నలు అడగటంపై ఆయన మండిపడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. మహారాష్ట్ర, జార్ఘండ్ ఎన్నికల వేళ రాహుల్ గాంధీ హడావుడిగా తెలంగాణకు వచ్చి.. కులగణన సర్వేకు సంబంధించి మేధా వుల అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తీసుకునేందుకు డమ్మీ సమావేశం నిర్వహించారన్నారు.

బీసీలపై రాహుల్ గాంధీకి నిజంగా చిత్త శుద్ధి, ప్రేమ ఉంటే.. రాష్ట్రంలో కాం గ్రెస్ ప్రభుత్వం నియమించిన కార్పొరేషన్ల చైర్మన్లలో ఎందరు బీసీలు న్నారో సమీక్ష చేయాలన్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి గారి రక్తంలో తెలం గాణ డీఎన్‌ఏ లేదంటూ విమర్శలు చేస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలపై కాసం మండిపడ్డారు.

ముందు రేవంత్‌రెడ్డి డీఎన్‌ఏ తెలంగాణాదా లేక టీడీపీదా లేక బీఆర్‌ఎస్ డీఎన్‌ఏనా తెలుసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఓబీసీ మోర్చా రాష్ర్ట అధ్యక్షుడు ఆనంద్ గౌడ్, ఎస్సీ మో ర్చా రాష్ర్ట ప్రధాన కార్యదర్శి క్రాంతి కిరణ్, నాయకులు పాల్గొన్నారు.