న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: లగ్జరీ కార్ల కంపెనీ మెరిడెస్ బెంజ్ దేశీయంగా తయారు చేసిన మరో ఎస్‌యూవీ మోడల్ ‘ఈక్యూస్ 580 4మాటిక్’ను సోమవారం విడుదల చేసింది. ఈ సెవన్‌సీటర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని మెర్సిడెస్ బెంజ్ యూఎస్ వెలుపలి దేశాల్లో ఇండియాలోనే తొలిసారిగా ఉత్పత్తి చేసింది. కంపెనీకి పూనెలో ఉన్న తయారీ ప్లాంట్‌లో ఉత్పత్తి చేసిన ఈక్యూస్ సెడాన్ తర్వాత తయారైన రెండో మోడల్ ‘ఈక్యూస్ 580 4మాటిక్’. ఇది తాము భార త్ మార్కెట్లో ప్రవేశపెట్టిన 6వ ఎలక్ట్రిక్ వాహనమని, స్థానికంగా ఉత్పత్తి చేసిన రెండో మోడల్ అని మెర్సిడెస్ బెంజ్ ఇండియా సీఈవో సంతోష్ అయ్యర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మేకిన్ ఇండియా విజన్‌కు తాము మద్దతు ఇస్తున్నామన్నారు. కొ త్తగా ప్రవేశపెట్టిన ‘ఈక్యూస్ 580 4మాటిక్’ ప్రారంభ ధర రూ.1.41 కోట్లు.