calender_icon.png 29 December, 2024 | 2:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త కనిష్ఠానికి రూపాయి

09-11-2024 01:47:49 AM

డాలరు మారకంలో 84.37కు తగ్గిన విలువ

ముంబై, నవంబర్ 8: అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన నేపథ్యంలో యూఎస్ డాలర్ భారీ ర్యాలీ జరపడంతో భారత్‌తో సహా వర్థమాన దేశాల కరెన్సీలన్నీ పతనమవున్నాయి. శుక్రవారం ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ మార్కెట్లో  (ఫారెక్స్)డాలరు మారకంలో రూపాయి విలువ సరికొత్త  కనిష్ఠస్థాయిని నమోదుచేసింది.

మరో 5 పైసలు క్షీణించి 84.37 వద్ద నిలిచింది. వరుసగా మూడు ట్రేడింగ్ సెషన్లలో దేశీయ కరెన్సీ 28 పైసలు కోల్పోయింది. దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు అదేపనిగా నిధులు తరలించడం కూడా రూపాయిపై ప్రభావం చూపిందని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు.

యూఎస్ కేంద్ర బ్యాంక్ మరోదఫా వడ్డీ రేట్లను తగ్గించడంతో అంతర్జాతీయ ఫైనాన్షియల్ మార్కెట్లలో మార్పు చోటుచేసుకుంటున్నదని, దీనికి తోడు డోనాల్డ్ ట్రంప్ తీసుకురానున్న పన్ను, వాణిజ్య విధానాలు ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయని, ఫలితంగా రూపాయి ఒడిదుడుకులకు లోనవుతున్నదని ఫారెక్స్ డీలర్లు వివరించారు.