calender_icon.png 8 January, 2025 | 8:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టెస్టు క్రికెట్‌కు కొత్త రూపు

07-01-2025 01:15:22 AM

దుబాయ్: టెస్టు క్రికెట్ కొత్త రూపు సంతరించుకోనుంది. ఇటీవలే ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరిగిన బోర్డర్ గావస్కర్ సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి విపరీత ఆదరణ దక్కింది. దీంతో టెస్టులకు మరిన్ని హంగులు జోడించాలని భావించిన ఐసీసీ త్వరలో టూఠూ విధానాన్ని ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం నిర్వహిస్తోన్న డబ్ల్యూటీసీ సైకిల్ మ్యాచ్‌లపై మాజీ క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు.

కొన్ని దేశాలు తక్కువ మ్యాచ్‌లు ఆడినా ఫైనల్ చేరుకుంటున్నాయని.. ఇది సరై న పద్దతి కాదని విమర్శించారు. ఈ విధానం అమల్లోకి వస్తే క్రికెట్‌లో భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాతో టాప్ ఉన్న మిగతా జట్లు ఎ క్కువ సంఖ్యలో టెస్టులు ఆడాలి. రెండో టైర్‌లో బంగ్లా, విండీస్, జింబాబ్వే, ఐర్లాండ్‌లలో  అత్యుత్తమ ప్రదర్శన చేసిన జట్లలో రెండింటికి టైర్ అవకాశం కల్పించనున్నారు.