calender_icon.png 16 November, 2024 | 9:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త రకం ఫోబియా?

16-11-2024 12:00:00 AM

ప్రతీ ఒక్కరికి ఏదో ఒక రకమైన ఫోబియా ఉంటుం ది. కొందరికీ నీళ్లు అంటే భయం ఉం టుంది. మరికొందరికీ నలుగురిలో కలవడం అంటే భయంగా ఉంటుం ది. దీన్నే ఫోబియాగా చెబుతుంటారు నిపుణులు. ఫోబియా అనే మానసిక వ్యాధికి లక్షణం. ఇటీవల ఇలాంటి ఫోబియాలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మహిళలను కొత్త రకమైన ఫోబియా వెంటాడుతోంది. అదేంటంటే ‘టోకోఫోబియా’. ఇంతకీ ఏంటీ సమస్య? దీనివల్ల జరిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

మహిళలు సంతానం పట్ల భయంతో ఉండటమే టోకోఫోబియా. ఇది ఒక మానసిక సమస్య. ఈ ఫోబియా కారణంగా మహిళలు గర్భం దాల్చడం, పిల్లలకు జన్మనివ్వడం విషయంలో భయపడుతుంటారు. ఈ భయం మహిళల జీవితాలను అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది.

గర్భం దాల్చడం, డెలివరీ విషయంలో లేదా నవజాత శిశువుకు సంబంధించి ఏదైనా చెడు అనుభవం ఎదురుకావడం, ఇతరులకు జరిగిన చెడు అనుభవాల కారణంగా ఈ ఫోబియా వస్తుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. గర్భధారణ సమయంలో సంభవించే శారీరక మార్పులు, ఆరోగ్య ప్రమాదాల గురించి కూడా ఆందోళన చెందుతుంటారు.

నిరాశ, ఆందోళన, అపోహలు, అనవసరమైన భయాలు టోకోఫోబియాకు కారణమవుతుండొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ ఫోబియాతో బాధ పడేవారు ఎలాంటి సందేహం లేకుండా మానసిక నిపుణులను సంప్రదించాలని చెబుతున్నారు. అవసరమైన కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు.