calender_icon.png 28 October, 2024 | 11:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రంలో క్రికెట్‌కు కొత్త జోష్

01-07-2024 12:56:04 AM

  • త్వరలో నూతన మైదానాల నిర్మాణం 
  • హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్

హైదరాబాద్, ఖేల్ ప్రతినిధి: భారత క్రికెట్ నియంత్రణా మండలి (బీసీసీఐ) సహకారంతో రాష్ట్రంలో క్రికెట్ సర్వతోము ఖాభివృద్ధికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆదివారం జరిగిన హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ సమావేశ వివరాలను అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు మీడియాకు వెల్లడించారు. ‘హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌కు తగ్గట్లు త్వరలో కొత్త అంతర్జాతీయ స్టేడియం నిర్మించేందుకు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాం.

యువ క్రికెటర్ల బంగారు భవిష్యత్తు కోసం.. హెచ్‌సీఏ క్రికెట్ ఆపరేషన్స్ హెడ్‌గా భారత మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్‌ను నియమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. రెండు జిల్లా కేంద్రాల్లో కొత్త మైదానాలు నిర్మిస్తాం. ఈ నెల 8 నుంచి దేశవాళీ సీజన్ ప్రారంభం కానుంది. మహిళల లీగ్ క్రికెట్‌కు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నాం’ అని జగన్‌మోహన్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌సీఏ కార్యదర్శి దేవ్‌రాజ్, కోశాధికారి శ్రీనివాస్, సునీల్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.