ఆస్తానా (కజకిస్థాన్): ఆసియా టీటీ చాంపియన్‌షిప్‌లో భారత మహిళల జట్టు కాంస్య పతకం నెగ్గి కొత్త చరిత్ర సృష్టించింది. జపాన్‌తో జరిగిన సెమీస్ పోరులో 3-1 తేడాతో మనికా బత్రా, అయికా ముఖర్జీ, సుతిర్థా ముఖర్జీ బృందం ఓటమి పాలైంది. ఆసియా చాంపియన్‌షిప్‌లో మహిళల జట్టుకు పతకం రావడం ఇదే తొలిసారి. మనికా బత్రా ఒక టి గెలిచి మరొకటి ఓడిపోయింది. అయికా ముఖర్జీ మాత్రం రెండింటిలోనూ ఓటమి పాలైంది. నేడు పురుషుల జట్టు సెమీ ఫైనల్ జరగనుంది.