టాలీవుడ్‌కు మరో కొత్త హీరో పరిచయం కాబోతున్నాడు. ఆయనే మారిశెట్టి అఖిల్. ఈ యువ కథానాయకుడు ఎవరో కాదు.. ఏపీకి చెందిన రాజకీయ నాయకుడు మారిశెట్టి శ్రీకాంత్ తనయుడే. శ్రీధన్ దర్శకత్వంలో ఏకే టెక్ మార్కెటింగ్ మూవీ క్రియేషన్స్ పతాకంపై మారిశెట్టి శ్రీకాంత్ నిర్మిస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రంలో భానుశ్రీ హీరోయిన్‌గా నటిస్తోంది.
ఈ సినిమా చిత్రీకరణ తాజాగా అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలోని నిర్మాత సొంత గ్రామమైన లక్ష్మీపురంలో ఉన్న రామాలయంలో ప్రారంభమైంది. సీనియర్ నిర్మాత నట్టికుమార్, చిత్ర కథానాయకుడు మారిశెట్టి అఖిల్, దర్శకుడు శ్రీధన్, నిర్మాత మారిట్టి శ్రీకాంత్, స్థానికులు పాల్గొన్నారు.