calender_icon.png 16 November, 2024 | 7:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మినిస్ట్రీ ఆఫ్ సెక్స్ పేరిట కొత్త శాఖ

10-11-2024 01:27:53 AM

రష్యాలో జనన మరణాల రేటు అంతరాన్ని తగ్గించే యత్నం

మాస్కో, నవంబర్ 9: రష్యాలో జనన మరణాల్లో అంతరం భారీగా పెరుగుతున్నట్లు అక్కడి అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ దేశంలో మినిస్ట్రీ ఆఫ్ సెక్స్ పేరుతో కొత్త మంత్రిత్వ శాఖను ఏర్పా టు చేయాలనే ప్రపోజల్ వచ్చింది. ఈ కొత్త ప్రతిపాదనను ఆ దేశ కుటుం బ రక్షణకు చెందిన పార్లమెంట్ కమి టీ పరిశీలిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనం వెలువడింది. రెండేళ్ల కు పైగా ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగుతున్న తరుణంలో రష్యాకు జనన మరణాల రేటు అంతరం పెరగడమనే కొత్త సమస్య వేధిస్తోంది.

ఈ నేపథ్యంలో జనన మరణాల రేటులో అంతరాన్ని తగ్గించేందుకు నూతన వ్యూహాలను అమలు చేయాలని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ పిలుపునిచ్చారు. దీంతో ఓ ఏజెన్సీ మినిస్ట్రీ ఆఫ్ సెక్స్ ప్రతిపాదన తీసుకొచ్చింది. జననాల రేటును పెంచే కార్యక్రమాలన్నీ ఈ శాఖ పరిధిలో ఉంచాలంటూ  సూచించింది. యువతకు ఫస్ట్ డేట్‌కు 5 వేల రూబెల్స్ ఇవ్వాలని సూచించింది. పిల్లలను చూసు కోవడం కోసం ఉద్యోగ్ంన మానేవారి కి కొంత మొత్తం చెల్లించాలని చెప్పింది.