calender_icon.png 18 March, 2025 | 6:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కీళ్ల నొప్పుల చికిత్సలో నూతన అధ్యాయం

18-03-2025 12:09:48 AM

అపోలో ఆస్పత్రిలో జాయింట్ ప్రిజర్వేషన్ ప్రోగ్రాం ప్రారంభం

హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 17 (విజయక్రాంతి): కీళ్ల నొప్పుల చికిత్సలో అ పోలో ఆస్పత్రి నూతన అధ్యాయాన్ని ప్రా రంభించింది. దేశంలోనే మొదటిసారిగా శస్త్ర చికిత్స అవసరం లేకుండానే కీళ్ల నొప్పులను తగ్గించే ‘జాయింట్ ప్రిజర్వేషన్ ప్రోగ్రాం’ను  ప్రారంభించింది.

అపోలో ఆస్పత్రుల జా యింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతరె డ్డి, సిడ్నీ రాయల్ ప్రిన్స్ ఆల్ఫ్రెడ్ హాస్పటల్ ఆర్థోపెడిక్ సర్జన్, ఆర్థోస్కోపిక్, మోకీళ్ల మార్పిడి నిఫుణుడు డాక్టర్ బ్రెట్ ఫ్రిట్ష్, అ  లో ఆస్పత్రుల ఛీఫ్ జాయింట్ రీప్లేస్‌మెం  ఆర్థ్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ కెజెరెడ్డి, అపోలో మెడికల్ సర్వీసెస్ ఛీఫ్ డాక్టర్ రోహిణి శ్రీధర్, సీఈవో తేజస్వీరావు, డాక్టర్ ఆర్థోపెడిక్ స్పోర్ట్స్ మెడిసిన్ కన్సల్టెంట్‌లు డాక్టర్ రుద్రరాజు, డాక్టర్ కౌశిక్‌రెడ్డి, షోల్డర్ సర్జన్ కన్సల్టెంట్ డాక్టర్ ప్రశాంత్ మేష్రామ్, ఫుట్, యాంకిల్ సర్జన్ డాక్టర్ వరుణ్ కొ మ్మాలపాటి తదితరులు సోమవారం కార్యక్రమాన్ని ప్రారంభించారు.

సంగీతరెడ్డి మా ట్లాడుతూ.. కీళ్ల నొప్పులతో బాధపడుతున్న అన్ని వయసుల వారికి ఉపయో గపడేలా జాయింట్ ప్రిజర్వేషన్ ప్రోగ్రాంను రూపకల్పన చేశామన్నారు. ఈ కొత్త పద్ధతిలో పూర్తి కీలు అవసరం మార్పిడి లేకుండా, కీళ్ల పనితీరును మెరుగుపరిచేలా సమస్యను నివారించడంపై తాము దృష్టిపెట్టామని ఛీఫ్ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్ డాక్టర్ జెకెరెడ్డి తెలిపారు.

జాయింట్ ప్రిజర్వేషన్ ప్రోగ్రాంలో భాగంగా ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా(పీఆర్‌పీ) చికిత్స, అత్యాధునిక స్టెమ్‌సెల్ వినియోగం వంటి మార్గదర్శక పునరుత్పత్తి చికిత్సలతో పాటు అధునాతన ఆర్థోబయోలాజిక్ చికిత్సలను ఉపయోగించడం ద్వారా రోగులు తమ కీళ్ల పనితీరును మెరుగుపర్చుకోవచ్చని పేర్కొన్నారు.