calender_icon.png 22 February, 2025 | 5:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధునాతన టెక్నాలజీతో నూతన వరవడికి నాంది పలకాలి

19-02-2025 06:55:41 PM

ఘట్‌కేసర్ (విజయక్రాంతి): ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి వినూత్న ప్రయోగాలకు శ్రీకారం చుట్టాలని సియేట్ లిమిటెడ్ ఫౌండర్ చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి తెలిపారు. పోచారం మున్సిపాలిటీ చౌదరిగూడలోని నల్ల నరసింహారెడ్డి ఎడ్యుకేషన్ సొసైటీస్ గ్రూప్ ఇనిస్టిట్యూషన్ లో టెక్ సంప్రతి, ఫార్మా సంప్రతి, తార 2కే25 జాతీయ టెక్నికల్ కల్చరల్ ఫెస్ట్ బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సియేట్ లిమిటెడ్ ఫౌండర్ చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి పాల్గొని పేస్ట్ ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ... ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో నిరంతరం కష్టపడి నూతన ఆవిష్కరణలకు సిద్ధం కావాలన్నారు. అధునాతన టెక్నాలజీని ఉపయోగించి ప్రపంచ ప్రజలకు అవసరమయ్యే ఉత్పత్తులను తయారు చేయాలన్నారు.

తాము చేసే పరిశోధనల ప్రపంచ ప్రజలకు ఆదర్శంగా నిలవాలన్నారు. కళాశాల చైర్మన్ నల్ల నర్సింహారెడ్డి మాట్లాడుతూ... కళాశాలలోని విద్యార్థులకు అవసరమైన శాస్త్ర సాంకేతిక పరికరాలను అందుబాటులో ఉంచి నిష్ణాతులైన ఫ్యాకల్టీలను నియమించినట్లు తెలిపారు. ప్రతి విద్యార్థి ఈ అవకాశాన్ని వినియోగించుకొని నూతన తరహా ప్రయోగాలు చేసి గుర్తింపు పొందాలన్నారు. డైరెక్టర్ డాక్టర్ సీవీ కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి, టెక్ సంప్రతి కన్వీనర్ జనార్ధన రాజు,  ఫార్మా సంప్రదతి కన్వీనర్ కృష్ణమోహన్, అధ్యాపకులు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.