న్యూయార్క్, డిసెంబర్ 27: ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధానోమ్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది. యెమెన్‌లోని సనా అంతర్జాతీయ విమనాశ్రయంలో ఆయన ఫ్లుటై ఎక్కుతుండగా, అక్కడి నుంచి కొన్నిమీటర్ల దూరంలో బాంబు పేలుడు సంభవించింది. బాంబు దాడిలో ఇద్దరు మృతిచెందారు. ప్రమాదం నుంచి టెడ్రోస్ త్రుటిలో తప్పించుకున్నారు. అనంతరం భద్రతా సిబ్బంది ఆయన్ను సురక్షిత ప్రాంతానికి తరలించారు. బాంబు దాడిని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ‘ఎక్స్’ వేదికగా ఖండించారు.