హుజూర్ నగర్ (విజయక్రాంతి): హుజుర్ నగర్ సీతారాం నగర్ లో 25వార్డ్ నివాసి అయిన జీవానంద్ రాజ్ సంజయ్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరంలో ఆంధ్ర బాడీ బిల్డింగ్ పోటీలలో గోల్డ్ మెడల్ సాధించడం గొప్ప విషయం అని కాంగ్రెస్ పార్టీ నాయకులు సులువ చంద్రశేఖర్, ఎడ్ల విజయ్ అన్నారు. సీతారాం నగర్ కనకదుర్గమ్మ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు గోల్డ్ మెడల్ సాధించిన జీవానంద్ రాజ్ సంజయ్ ను, కొడుకును ప్రోత్సహించిన తండ్రి రాజ్ కుమార్ ను పూలమాలలతో, శాలువాలతో ఘనంగా సన్మానం చెయ్యడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బాడీ బిల్డింగ్ పోటీలలో రాజ్ సంజయ్ పాల్గొని గోల్డ్ మెడల్ సాధించడం హుజుర్ నగర్ కు దక్కిన గౌరవం, అదృష్టంగా భావిస్తున్నాం అనిా, ప్రస్తుతం యువత చెడు దారులు పట్టకుండా చిన్న వయసులోనే ఇటువంటి ఉన్నత లక్ష్యాలను పెట్టుకొని కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయని, యువత కష్టపడే తత్వాన్ని అలవాటు చేసుకుంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చు అని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఒర్స్ వెంకన్న, తోట ఉపేందర్, వెన్నం శ్రీను, వెన్నం నరసింహరావు, దారనరసింహ రావు, దగ్గుపాటి రమేష్, ములకలపల్లి రాము, నిస్సార్, కటారి లింగ రాజు, దార రమేష్, షేక్ జాకీర్, జీవానంద్ రాజు కుమార్, ములకలపల్లి కొండల్, అశోక్, అజయ్ కాలనీవాసులు పాల్గొన్నారు.