- కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు గుర్తించాలి
- మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, డిసెంబర్ 2 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులు మూడు సీజన్లలో రైతుబంధు నష్టపోయారని, సర్కార్ పథకానికి పూర్తిగా ఎగనామం పెట్టిందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో సోమవారం నిర్వహించిన మీడి యా సమావేశంలో ఆయన మాట్లాడారు.
పెట్టుబడి సాయంపై భూ యజమానులు, కౌలు రైతులు ఒప్పందాలు చేసుకోవాలని సర్కార్ పేర్కొనడం దారుణమన్నారు. రాష్ట్రప్రభుత్వం కనీసం ఆడబిడ్డలకు బతుకమ్మ చీర్లునా ఇవ్వలేదని మండిపడ్డారు. మద్యం అమ్మకాలు పెంచి సర్కార్ ఆదాయం పెంచుకోవాలని చూస్తున్నదని, అందుకు అవసరమై తే దుకాణాలను పెంచాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని ఆరోపించారు.
పేదలపై ప్రేమ ఉంటే ఎల్‌ఆర్‌ఎస్‌ను ప్రభుత్వం ఉచితంగా చేయాలని డిమాండ్ చేశారు. పోటీ పరీక్షలను వాయిదా వేయాలని నిరుద్యోగులు కోరుతున్నారని స్పష్టం చేశారు. నిరుద్యోగులు తమ బాధ వెల్లడిస్తుంటే, వారు ప్రతిపక్షాల మాయలో పడ్డారని వ్యాఖ్యానించడం సరికాదన్నారు.
బీఆర్‌ఎస్ ఈనెల 7న రాష్ట్రప్రభుత్వ ప్రభుత్వ వైఫల్యాలపై చార్జీషీట్ వేస్తామని ప్రకటించారు. మోసపోతే గోస పడతామని ప్రజలు గుర్తించాలని, రాష్ట్రప్రభుత్వ వైఫల్యాలను వారు గుర్తించాలని సూచించారు. ఏడాది పాలనలో రైతులు రైతుబంధు, మహిళలు బతుకమ్మ చీరెలు, పింఛనర్లు పెన్షన్లు కోల్పోయారన్నారు. వంచనకు కేరాఫ్ కాంగ్రెస్ ప్రభుత్వమన్నారు.