calender_icon.png 3 April, 2025 | 8:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రష్యాలో విజృంభిస్తోన్న అంతుచిక్కని వైరస్

02-04-2025 11:59:17 PM

మాస్కో: రష్యాలో అంతుచిక్కని వైరస్ విజృంభిస్తున్నట్టు పలు వార్తాసంస్థలు పేర్కొంటున్నాయి. అక్కడి ప్రజలు తీవ్రమైన శ్వాసకోస సంబంధిత వ్యాధులతో దీర్ఘకాలిక జ్వరంతో బాధపడుతున్నారని తెలిపాయి. వైరస్ కారణంగా వారు దగ్గుతున్నప్పుడు రక్తం పడుతోందనే నివేదికలు ప్రపంచ దేశాల్లో ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. రష్యాలో మిస్టరీ వైరస్ విజృంభిస్తోందని మార్చి 29న పలు నివేదికలు వెలువడ్డాయి.

పలు నగరాల్లో ప్రజలు వారాల తరబడి జ్వరం, ఒళ్లు నొప్పులు, తీవ్ర దగ్గుతో బాధపడుతున్నారని.. ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని పేర్కొన్నాయి. కోవిడ్ టెస్టులు చేసినప్పుడు నెగిటివ్ వచ్చిందని.. ఇది మరో కొత్త వైరస్ అయి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశాయి. కాగా ఈ వార్తలను రష్యా అధికారులు ఖండించారు. తాము జరుపుతున్న పరీక్షల్లో దేశంలో ఎలాంటి నూతన వ్యాధి కారకాలు బయటపడలేదని.. కొత్త వైరస్ వ్యాపించినట్టు ఎటువంటి ఆధారాలు లేవని వెల్లడించారు. రకరకాల వదంతులు, తప్పుడు ప్రచారాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నప్పటికీ అందులో నిజం లేదన్నారు.