calender_icon.png 23 October, 2024 | 2:14 AM

ముస్లిం మహిళకు భరణం ఇవ్వాల్సిందే

11-07-2024 01:34:48 AM

  1. దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు
  2. సీఆర్‌పీసీలోని 125 సెక్షన్ ఇందుకు అవకాశం కల్పిస్తోంది

న్యూఢిల్లీ: సుప్రీం బుధవారం సంచలన తీర్పు ఇచ్చింది. విడాకులు తీసుకున్న ముస్లిం మహిళకు భరణం కోరే హక్కు ఉందని స్పష్టం చేసింది. తన భార్య విడాకుల అనంతరం భరణం అడుగుతోందని  ఇచ్చేందుకు తాను సి ద్ధంగా లేనని ఓ పిటిషనర్ వేసిన కేసును కొట్టివేస్తూ.. జస్టిస్  నాగరత్న, జస్టిస్ అగస్ట్రున్ కీలక తీర్పు చెప్పారు. ‘దేశంలోని అన్ని మతా ల మాదిరిగానే ముస్లిం మహిళలకు కూడా విడాకులైన అనంతరం భర్త.. భరణం ఇవ్వాల్సిందే’ అని స్పష్టం చేశారు.

హైదరాబాద్‌కు చెందిన  సమద్ కొన్నేళ్ల క్రితం తన భార్యకు విడాకులు ఇచ్చాడు. వాదనల అనంతరం వారికి విడాకులు మంజూరు చేసిన ఫ్యామిలీ కోర్టు.. ప్రతీ నెల రూ.10వేలు భరణం చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పును వ్యతిరేకించిన సమద్ రాష్ట్ర హైకోర్టులో సవాల్ చేయగా కింది కోర్టు తీర్పులో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ క్రమంలో సమద్ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. పిటిషన్‌పై విచారించిన సుప్రీం కోర్టు కింది కోర్టు తీర్పును సమర్థించింది. 1985 ఏడాదిలో షాబానో కేసు తీర్పును ఉద హరిసూ..్త సీఆర్‌పీసీలోనీ 125 సెక్షన్ ప్రకారం భరణం పొం దే హక్కు దేశంలోని ప్రతి మహిళకు ఉందని స్పష్టం చేసింది.  

వారి త్యాగాలను గుర్తించండి..

తీర్పు సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఇంటి పట్టున ఉండే భార్యలంటే కొంతమంది భర్తలు చులకనగా చూస్తున్నారు.. వారు ఇంటిపనితో పాటు పిల్లల, మీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడం వలనే మీరు సొసైటీలో పని చేయగలుగుతున్నారు. ఇప్పటికైనా గృహిణుల విలువ, కుటుంబం కోసం వారు చేసే త్యాగాలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తించాలి’ అని ధర్మాసనం పేర్కొంది.