calender_icon.png 19 April, 2025 | 7:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజనుల సంప్రదాయాలు గుర్తుండేలా మ్యూజియం

14-03-2025 12:00:00 AM

ఐటీడీఏ పీవో రాహుల్ 

భద్రాచలం మార్చి 13 (విజయ క్రాంతి): ఆదివాసి గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాలు కనుమరుగు కాకుండా అందరికీ గుర్తుండి పోయేలా మ్యూజియం ని చూడగానే కొత్త అనుభూతి వచ్చేలా సర్వ సుందరంగా ముస్తాబు చేస్తున్నామని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.  గురువారం  ఐటిడిఏ ప్రాంగణంలోని ట్రైబల్ మ్యూజియంలో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రైబల్ మ్యూజియం నాకు సంబంధించిన అన్ని పనులు చివరి దశకు వచ్చాయని ఈనెల 22 వరకు పూర్తిస్థాయిలో  పనులు పూర్తిచేసి శ్రీరామనవమి నాటికి ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు.

ప్రస్తుతం పాతకాలపు ఇల్లు నిర్మాణము పూర్తిస్థాయిలో చేపట్టడం జరిగిందని, కోయకల్చర్ కు సంబంధించిన పెయింటింగ్ చిత్రాలు చివరి దశకు వచ్చాయని, పండుగలకు సంబంధించిన పెయింటింగ్ చిత్రాలు చిత్రీకరణ జరుగుతుందని అన్నారు. బాక్స్ క్రికెట్ గ్రౌండ్, బోటింగ్ చెరువు, ఆర్చరీ గ్రౌండ్ పనులు సోమవారం వరకు పూర్తి అవుతాయని, పిల్లల ఆట స్థలాలు పూర్తిస్థాయిలో నిర్మాణం జరిగిపోయిందని అన్నారు. సందర్శకులు మ్యూజియమును సందర్శించిన ప్పుడు వారికి గిరిజన వంటకాలకు సంబంధించిన అన్ని రకాల ఆహార పదార్థాలు అందుబాటులో ఉంచుతున్నామని వాటికి సంబంధించిన స్టాల్స్ కూడా సిద్ధం చేశామన్నారు.

గిరిజన వంటకాలతో పాటు చైనీస్ ఫుడ్, కోయకల్చర్ కు సంబంధించిన బొమ్మలు  సందర్శకులు కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టామని, పాత తరంకు సంబంధించిన అన్ని కళాఖండాలు మ్యూజియంలో పొందుపరచడం జరిగిందని అన్నారు. పర్యాటకులు మ్యూజియంను సందర్శించి పూర్తిస్థాయిలో గిరిజన కల్చర్ కు సంబంధించిన ప్రతి అంశం క్షుణ్ణంగా తెలుసుకునేలా వాటి యొక్క చరిత్ర ప్రదర్శించేలా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, ఈ ఈ ట్రైబల్ వెల్ఫేర్ చంద్రశేఖర్, ఉద్యానవన అధికారి ఉదయ్ కుమార్, డి ఈ హరీష్, స్పోరట్స్ ఆఫీసర్ గోపాలరావు, ఏ ఎస్ ఓ నర్సింగరావు, ఏపీ ఓ పవర్ వేణు, డీఎస్‌ఓ ప్రభాకర్ రావు, ఈవో జిపి శ్రీనివాసరావు, హెచ్ ఓ చిట్టిబాబు, మ్యూజియం ఇంచార్జ్ వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.