calender_icon.png 29 April, 2025 | 3:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొండంత రాగం.. దిక్కుమాలిన పాట

29-04-2025 01:29:18 AM

కేసీఆర్ ఎల్కతుర్తి స్పీచ్‌పై బీజేఎల్పీ నేత ఏలేటి 

హైదరాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): ఎల్క తుర్తిలో జరిగిన బీఆర్‌ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ స్పీచ్ కొండంత రాగం తీసి దిక్కుమాలిన పాట పాడినట్లుగా ఉందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. రాష్ర్టం ఏర్పడిన తర్వాత విధ్వంసానికి కారణమైన మొట్టమొదటి వ్యక్తి కేసీఆరే అని ఆరోపించారు. బీజేపీ రాష్ర్ట కార్యాలయంలో సోమవారం ఆయ న మాట్లాడారు.

ప్రాజెక్టుల కేసీఆర్ పేరిట లక్షల కోట్ల అప్పుతో రాష్ట్రా న్ని అధోగతికి తీసుకెళ్లారని.. ఆయన హయాంలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని డిమాం డ్ చేశారు. 10 లక్షల మందితో సభ నిర్వహిస్తామంటూ రూ.150 కోట్లు ఖర్చు చేసినా లక్ష మందిని కూడా సమీకరించలేకపోయారని ఎద్దేవా చేశారు. గతంలో తెలంగాణ సాధించిన పేరుతో ఓట్లు కొల్లగొట్టిన బీఆర్‌ఎస్, మార్పు తెస్తామని ఓట్లు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రెండూ కలిసి ప్రజలను మోసం చేశాయన్నారు