15-03-2025 12:10:36 AM
ఖమ్మం, మార్చి 14(విజయక్రాంతి ): భారీ కొండ చిలువ ఉన్నట్టుండి నిత్యం రద్దీగా ఉండే రహదారి మీదకు రావడంతో జనం హడలిపోయారు. ఖమ్మం రూరల్ మండలం కరుణగిరి బైపాస్ రోడ్డు వద్ద శుక్రవారం భారీ కొండ చిలువ రోడ్డుపైకి దూసుకొచ్చింది.దీంతో దాన్ని గమనించిన వాహనదారులు కొండచిలువను చూసి భయాందోళనతో అప్రమత్తమయ్యారు.
కొద్ది సేపు వాహనాలను నిలిపివేశారు. కొండచిలువ రోడ్డు దాటుకుని వెళ్లేంతవరకు వేచి వున్నారు. ఈ సందర్భంగా వాహనాదారులు కొండచిలువను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో ఇందుకు సంబందించిన వీడియో చక్కర్లు కొట్టింది.