24-02-2025 10:43:18 PM
పిల్లలకు కూల్ డ్రింక్స్ లో గడ్డి మందు కలిపిన వైనం..
చికిత్స పొందుతూ కుమార్తె మృతి..
మహబూబాబాద్ (విజయక్రాంతి): అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నారని నెపంతో కన్న పిల్లలకు కూల్ డ్రింక్స్ లో గడ్డి మందు కలిపిన సంఘటన మహబూబాబాద్ జిల్లాలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం జోగ్య తండా గ్రామానికి చెందిన ఉష అక్రమ సంబంధం పెట్టుకుని తన కడుపులో పుట్టిన కుమారుడు వరుణ్ తేజ్ 07 సంవత్సరాలు నిత్యశ్రీ 05 సంవత్సరాలు ఈనెల 5వ తేదీన కూల్డ్రింక్స్ లో గడ్డిమందు కలిపి పిల్లలకి ఇచ్చింది. కాగా 17 రోజులుగా చావు బ్రతుకుల మధ్య హైదరాబాద్ నిలోఫర్ హాస్పిటల్ లో పోరాటం చేస్తున్న వరుణ్ తేజ్ నిత్యశ్రీలో నిత్యశ్రీ రాత్రి ఒంటిగంట సమయంలో మృతి చెందింది. కాగా నిత్యశ్రీ మృతితో జోగ్య తండా గ్రామం కన్నీటి సముద్రంలో మునిగిపోయింది. పోస్టుమార్టం నిమిత్తం హైదరాబాద్ నుండి స్వగ్రామం జోగ్య తండాకు చిన్నారి పార్థీవదేహం తీసుకురాగా ఆ సమయంలో చిన్నారులను చంపాలని చూసిన కన్నతల్లిపై గ్రామంలోని ప్రజలు తిరగబడ్డారు.
ఈ సందర్భంగా ఉషపై డోర్నకల్ పోలీస్ స్టేషన్ లో పదిహేను రోజుల క్రితమే చిన్నారుల నాయనమ్మ బుజ్జి కేసు పెట్టగా ఈ కుట్ర కోణంలో ఉషా వెనుక ఎంతమంది ఉన్నారు చిన్నారులను చంపాలని ఉషాకు ఎవరు సలహా ఇచ్చారు వారిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో ముఖ్యంగా ఉషా వాడిన ఫోన్ డేటాను పోలీసులు పరిశీలిస్తే అసలుకు నిజనిజాలు వెలుగులోకి వస్తాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చిన్నారి నిత్యశ్రీకి న్యాయం జరగాలని అభం శుభం తెలియని చిన్నారుల ప్రాణాలు తీయాలని చూసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకునే వరకు పోరాటం చేస్తామని గ్రామస్తులు సోమవారం ధర్నా చేశారు. డోర్నకల్ మండల వ్యాప్తంగా ప్రజలు కన్నీళ్లు మున్నేరుగా వినిపిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డోర్నకల్ మండల ప్రజలు కోరుతున్నారు.