05-04-2025 06:26:02 PM
కోరుట్ల కాంగ్రెస్ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు...
జగిత్యాల (విజయక్రాంతి): రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ పథకం చరిత్రలో నిలిచిపోయే ఘట్టమని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ జువ్వాడి నర్సింగరావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణిని కోరుట్ల పట్టణ 14, 15 వార్డులలో గల రేషన్ షాపులలో శనివారం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ... ఉగాది పర్వదిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు లాంఛనంగా ప్రారంభించడం జరిగిందన్నారు. పేద మధ్యతరగతి వారు ధనవంతుల లాగానే సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం అందజేస్తుందని తెలిపారు.
గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో ఒక్క కొత్త రేషన్ కార్డు మంజూరు చేయలేదని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేషన్ కార్డుల్లో 20 లక్షల మంది కొత్త పేర్లను చేర్చడం జరిగిందని, రాష్ట్రంలో 3 కోట్ల 10 లక్షల మందికి సన్న బియ్యాన్ని అందజేయనున్నట్లు తెలిపారు. 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు ఇవ్వనున్నామన్నారు ఉచిత బస్సు రైతు బీమా రైతు భరోసా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ 500 రూపాయలకే సబ్సిడీ ద్వారా గ్యాస్ సిలిండర్ అందజేయడం జరుగుతుందన్నారు. రానున్న రోజుల్లో ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామన్నారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావుతో పాటు కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.