calender_icon.png 27 October, 2024 | 4:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బండే మహంకాళి సన్నిధిలో ముహూర్తం

04-07-2024 12:05:00 AM

కన్నడ హీరో పృథ్వీ అంబర్ నటిస్తున్న తాజా చిత్రం ‘చౌకీదార్’. చంద్రశేఖర్ బండియప్ప దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు సాయికుమార్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ధన్యా రామ్‌కుమార్ ఫీమేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ముహూర్తపు వేడుకను మేకర్స్ బెంగళూరులోని బండే మహంకాళీ ఆలయంలో బుధవారం నిర్వహించారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత కల్లహళ్లి చంద్రశేఖర్ క్లాప్ కొట్టగా, సాయికుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. షూటింగ్ త్వరలో ప్రారంభిస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి బ్యానర్: విద్యాశేఖర్ ఎంటర్‌టైన్‌మెంట్; సంగీతం: సచిన్ బస్రూర్; సాహిత్యం: నాగేంద్ర ప్రసాద్, ప్రమోద్ మరవంటే.