calender_icon.png 16 November, 2024 | 8:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి చాక్లెట్ల కలకలం

24-09-2024 12:00:00 AM

సుచిత్రా క్రాస్ రోడ్ వద్ద 12.6 కిలోలు పట్టివేత

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): నగరం లో మరోసారి గంజాయి చాక్లెట్ల రవాణా కలకలం సృష్టించింది. సైబరాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎల్లమ్మబండకు చెందిన టాంక్ ఇస్సర్‌సింగ్ ఇస్సర్ అనే వ్యక్తి గంజాయి చాక్లెట్ ప్యాకెట్లను తరలిస్తుండగా సోమవారం సుచిత్ర క్రాస్ రోడ్ వద్ద మాధాపూర్ ఎస్వోటీ పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుడిని విచారించగా పంజాబ్‌లోని రాణిపూర్ జిల్లాకు చెందిన సాహిబ్ అనే డ్రగ్స్ విక్రేత నుంచి గంజాయి చాకెట్లు కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. నిందితుడి నుంచి పోలీసులు 12.6 కిలోల గంజాయి చాక్లెట్లతో పాటు 80 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

1.83 కిలోల గంజాయి స్వాధీనం

అప్పర్ ధూల్‌పేట్ బలరాంగల్లీలోని ఓ ఇంట్లో గంజాయి విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు సోమవారం దాడుల నిర్వహించారు. సంధ్యాభాయ్ అనే మహిళ ఇంట్లో 1.83 కిలోల గంజాయితోపాటు సరుకు విక్రయించగా వచ్చిన రూ.62వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలికి గంజాయి సరఫరా చేసిన అభిషేక్‌సింగ్, సంజనాభాయ్, రాజ్‌నందిని సింగ్, అతిశ్‌సింగ్‌పైనా కేసులు నమోదు చేశారు.