ఇబ్రహీంపట్నం (విజయక్రాంతి): తప్పిపోయిన ఓ వృద్దుడి అస్థిపంజరం లభ్యమైన ఘటన ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రాఘవేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని మంగళ్‌పల్లి పటేల్‌గూడ గ్రామానికి చెందిన యంజాల లక్ష్మయ్య (78), ఇటీవల తప్పిపోవడంతో ఆదిభట్ల పోలీస్ స్టేషన్‌లో తన కుటుంబికులు మిస్సింగ్ కేసు పెట్టినప్పటికీ ఇంతవరకు అతని ఆచూకీ లభించలేదు. అయితే బుధవారం బొంగ్లూర్‌లోని ఈకామ్ ఎక్స్‌ప్రెస్ వెనుకవైపు, మంగళ్‌పల్లి అటవీప్రాంతంలో ఒక గుర్తు తెలియని అస్థిపంజరం చూసిన ఓ గొర్లకాపరి స్థానికుల సహాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్లూస్‌టీమ్ సేకరించారు. స్టేషన్‌లో నమోదైన మిస్సింగ్ కేసు వివరాల ఆధారంగా మృతిడిని గుర్తించామన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.