నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ రహదారిపై మామురా వద్ద గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. నిర్మల్ వైపు నుంచి కడెంకు పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సును ఎదురుగా వస్తున్న మరో వాహనం ఢీకొట్టడంతో పెళ్లి బస్సు డ్రైవర్ బస్సులోనే ఇరుక్కుపోయారు. రెండు వాహనాలు దారిపై ప్రమాదానికి గురి కావడంతో మాముడా పోలీసులు రెవెన్యూ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని క్యాబిన్లో ఎరుకుల డ్రైవర్ను జెసిబి సహాయంతో బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. బస్సులో ప్రయాణిస్తున్న మరో ఆరుగురికి స్వల్ప గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. సోను సీఐ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు సుమంగళి రాజు రెవెన్యూ అధికారులు బస్సులో ఉన్న ప్రయాణికులను దించి ఆర్టీసీ బస్సులో కడెంకు తరలించారు. పెళ్లి బస్సు డ్రైవర్ చాకచక్కగా వివరించడంతో పేరు ప్రమాదం తప్పినట్లు సభ్యులు తెలిపారు. పోలీసులు సకాలంలో స్పందించి డ్రైవర్ ప్రాణాలను కాపాడారు.