calender_icon.png 4 January, 2025 | 1:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెదక్ డీసీసీబీ చైర్మన్ దేవేందర్‌రెడ్డికి తప్పిన ప్రమాదం

03-11-2024 01:22:39 AM

గజ్వేల్, నవంబర్ 2: సిద్దిపేట జిల్లాలోని రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ చైర్మన్ దేవేందర్‌రెడ్డి స్వల్పగాయాలతో బయటపడ్డారు. వివరాలు.. శనివారం కరీంనగర్ నుంచి హైదరాబాద్ వైపు బలేనో కారులో వెళ్తున్న ఓ కుటుంబం రిమ్మనగూడ, కొడకండ్లల మధ్య రోడ్ క్రాసింగ్ వద్ద కారు మలుపుతుండగా అదే సమయంలో కొండపాక నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి ఫార్ట్యునర్ కారు వేగంగా వచ్చి రోడ్డు క్రాస్ చేస్తున్న బలేనో కారును ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో బలేనో కారులోని జమీల అనే వృద్ధురాలు అక్కడికక్కడే మృతిచెందగా, అదే వాహనంలోని ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఫార్ట్యునర్‌లో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో డీసీసీబీ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, అతడి డ్రైవర్ సతీష్‌రెడ్డి స్వల్పగాయాలతో బయటపడ్డారు. ప్రమాదంలో చనిపోయిన, గాయపడ్డ వారి వివరాలను పోలీసులు వెల్లడించలేదు.