calender_icon.png 25 March, 2025 | 9:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంథనిలో అద్భుతం ఆవిష్కృతం

24-03-2025 01:20:42 AM

  1. 5వేల మంది భక్తులతో భగవద్గీత విజయోత్సవ సభ
  2. హాజరైన మంత్రి శ్రీధర్‌బాబు, విజయక్రాంతి దినపత్రిక ఎండీ విజయారాజం

మంథని, మార్చి 23 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సనాతన ధర్మ ప్రచార సమితి, శ్రీసీతారామ సేవాసదన్‌ల సంయు క్త ఆధ్వర్యంలో మంథనిలోని శివకిరణ్ గార్డెన్స్‌లో ఆదివారం భగవద్గీత విజయోత్సవ సభ నిర్వహించారు. భారీ ఎత్తున సామూహిక పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించా రు. మంథనిలోని లక్ష్మీనారాయణ స్వామి ఆలయం నుంచి భగవద్గీత విజయోత్సవ శోభాయాత్ర ప్రారంభమై, శ్రీ నృసింహ శివ కిరణ్ గార్డెన్‌కు చేరుకున్నది.

రాష్ట్రంలోని 70 ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి శోభాయాత్రల్లో పాల్గొన్నారు. కార్యక్రమ ఉత్సవ నిర్వ హక కమిటీ అధ్యక్షుడు వొడ్నాల శ్రీనివాస్, తెలంగాణ సనాతన ధర్మ ప్రచార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మంథెన శ్రీనివాస్, సనాతన ధర్మ ప్రచార సమితి రాష్ట్ర కార్యదర్శి మేడగోని రాజమౌళి గౌడ్ కలిసి వొడ్నా ల శ్రీనివాస్ బృందం భగవద్గీత విజయోత్సవ సభను నిర్వహించారు.

ఐటీ శాఖ మం త్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హాజరై మాట్లాడుతూ.. ప్రపంచంలో ఇప్పటి వరకు ఎక్కడా జరగని విధంగా వేదగడ్డగా నిలిచిన మంత్రపురిలో 665 రోజులపాటు నిరంతరాయం గా 665 ఇండ్లలో గీతా పారాయణాన్ని నిర్వహించడం శుభ పరిణామం అన్నారు. గీతా పారాయణంలో పాల్గొన్న వారికి మెమెంటోలు అందజేశారు.

స్వాములను సత్కరించారు. ఇంటర్నేషనల్ వరల్ బుక్ ఆఫ్ రికారడ్స్ లో స్థానం కల్పించిన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ వరల్ రికార్డ్స్ వారు కార్యక్రమాన్ని తిలకించి తమ నమోదు చేసుకున్నారు. ప్రవచకులుగా ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, విశిష్ట అతిథిగా సీఎల్ విజయరాజంతో పాటు పలువురు వక్తలు హాజరయ్యారు.

భక్తులనుదేశించి ఉద్దేశించి ఎనిమిది మంది స్వామీజీలు భగవద్గీత గొప్పతనం గురించి వివరించారు. కార్యక్రమంలో కొత్త శ్రీనివాస్‌గుప్తా, వేడగోని రాజమౌళిగౌడ్, పుప్పాల విక్రమ సింహారావు. కొండమేన అశోక్‌కుమార్, బండారి సురేష్, ప్రాయాకర్ రావు కృష్ణమూర్తి, మాడిశెట్టి సత్యనారాయణ, మంథని శ్రీనివాస్ పాల్గొన్నారు.