బెల్లం తింటే కలిగే ప్రయోజనాలు అందరికీ తెలిసిందే.. అయితే సాధారణ బెల్లం కంటే తాటి బెల్లం తింటే కలిగే లాభాలు ఎప్పుడైనా విన్నారా? ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. తాటి బెల్లం కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం..
తాటి బెల్లంలో ఐరన్, మెగ్నీషియం రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్ నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. తాటి బెల్లం తరచూ తీసుకోవడం వల్ల క్యాల్షియం, పొటాషియం పెరుగుతుంది. ఫలితంగా ఎముకలు దృఢంగా తయారవుతాయి. నెలసరి, అధిక బరువు సమస్యలకు కూడా తాటి బెల్లం సహాయపడుతుంది. చక్కెరతో పోలిస్తే తాటిబెల్లంలో ఖనిజ లవణాలు 60 శాతం ఎక్కువ. టీ, కాఫీ, పండ్ల రసాల్లో తాటిబెట్టాన్ని వాడవచ్చు.
తాటిబెల్లం జీర్ణ సమస్యలకు చక్కగా ఉపయోగపడుతుంది. తాటి బెల్లంలోని పీ చు పదార్థం మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది.