calender_icon.png 10 April, 2025 | 8:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం లారీని పక్కదారి పట్టించిన మిల్లర్

11-12-2024 01:23:20 AM

కామారెడ్డి, డిసెంబర్ 10 (విజయక్రాంతి): సీఎంఆర్ బియ్యాన్ని ప్రభు త్వానికి అప్పగించాల్సి ఉండగా ఓ మిల్లర్ పక్కదారి పట్టించేందుకు యత్నించగా కేసు నమోదయింది. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని వజ్ర కండి శివారులో గల పరమేశ్వర ఫుడ్ ఇండస్ట్రీస్ రైస్ మిల్లు యజమాని ప్రభుత్వం నుంచి తీసుకున్న ధాన్యాన్ని లారీలో బయట అమ్ముకునేందుకు తరలిస్తుండగా ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడులు చేసి పట్టుకున్నారు. ప్రభుత్వానికి అప్పగించా ల్సిన 21,583 క్వింటాళ్ల ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్లు అధికారులు గుర్తించారు. యజమానిపై కేసు నమోదు చేసినట్లు జుక్కల్ ఎస్సై భువనేశ్వరరావు తెలిపారు.