calender_icon.png 26 December, 2024 | 10:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.కోటి బియ్యాన్ని దిగమింగిన మిల్లు!

05-11-2024 12:47:22 AM

శ్రీనివాస్ రైస్‌మిల్‌పై అనుమానాలు 

ఖమ్మం, నవంబర్ 4 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లా కొణిజర్లలోని శ్రీనివాస రైస్ మిల్ సీఎంఆర్ ధాన్యానికి సంబంధించి కోటీ రూపాయలకు పైగానే దారి మళ్లించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి సీఎంఆర్ కోసం తీసుకున్న ధాన్యంలో ప్రభుత్వానికి గడువు ముగిసినా బియ్యం సరఫరా చేయకపోవడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

గత ఖరీఫ్ సీజన్‌లో ఈ మిల్లుకు ప్రభుత్వం  1,160 క్వింటాళ్ల ధాన్యం సీఎంఆర్ కోసం సరఫరా చేసింది. అందులో మిల్లు కేవలం 7,250 క్వింటాళ్ల బియ్యాన్ని మాత్రమే ప్రభుత్వానికి తిరిగి సరఫరా చేసినట్లు తెలిసింది. మిగిలిన 4,350 క్వింటాళ్ల ధాన్యాన్ని ఇంతవరకు బియ్యం ఇవ్వలేదు. సంబంధిత శాఖాధికారులు ఎన్నిమార్లు అడిగినా దాటవేస్తూ వస్తున్నారు. 

దీంతో ఈ మిల్లు కూడా డిఫాల్ట్ జాబితాలో చేరినట్లేనని అంటున్నారు. ఈ మిల్లుకు గత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ప్రభుత్వం 1062, 101, 1010 రకాల ధాన్యాన్ని సరఫరా చేసింది. ఈ ధాన్యానికి మార్కెట్‌లో మంచి ధర ఉంది. మిల్లు యాజమాన్యం ఇవ్వాల్సిన బియ్యం ధర మార్కెట్‌లో దాదాపు కోటి రూపాయలకు పైగానే ఉంటుంది.