calender_icon.png 12 February, 2025 | 1:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వామి వివేకానంద పర్యటన గుర్తుగా సమాజానికి, యువతకు సందేశ కార్యక్రమం..

11-02-2025 11:16:50 PM

కళాశాల నిర్వహణ కమిటీ గౌరవాధ్యక్షుడు పీఎల్ శ్రీనివాస్...

ముషీరాబాద్ (విజయక్రాంతి): స్వామి వివేకానంద తొలి హైదరాబాద్ సందర్శనను గుర్తు చేసుకునేందుకు శ్రీ రామకృష్ణ మాథిస్‌తో కలిసి ఈ నెల 13న మహబూబ్ కళాశాలలో స్వామి వివేకానంద ఆడిటోరియంలో సమాజానికి, యువతకు సందేశం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు  మహబూబ్ కళాశాల నిర్వహణ కమిటీ గౌరవ అధ్యక్షుడు పీఎల్ శ్రీనివాస్ తెలిపారు. సమాజానికి, యువతకు ప్రత్యేక సందేశాన్ని అందించడానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ మేరకు మంగళవారం హైదర్‌గూడలోని ఎన్‌ఎస్‌ఎస్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కళాశాల ఉపాధ్యక్షుడు నరేష్ యాదవ్‌తో కలిసి మాట్లాడుతూ స్వామి వివేకానంద 1893 ఫిబ్రవరి 13న మహబూబ్ కళాశాలలో అడుగుపెట్టి, ఆ అల్లకల్లోల రోజుల్లో హైదరాబాద్ పౌరులతో సంభాషించడానికి, ప్రపంచ మతాల శిఖరాగ్ర సమావేవంలో పాల్గొనడానికి చికాగోకు బయలుదేరే ముందు, అక్కడ ఆయన హిందుత్వంపై అసాధారణ ప్రసంగం చేశారని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరవుతారని తెలిపారు. స్వామి ప్రభోదానందతో పాటు శ్రీ రామకృష్ణ మఠంలోని ఇతర సీనియర్ సన్యాసులు పాల్గొంటారని ఆయన తెలిపారు.