calender_icon.png 9 February, 2025 | 8:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డిలో వ్యాపారి కుచ్చుటోపీ

09-02-2025 12:00:00 AM

  1. రూ.రెండు కోట్లకు పైగా ఐపీ పెట్టి పరార్
  2. మెగా మార్ట్ నిర్వాహకుడి నిర్వాకం

కామారెడ్డి, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఓ సూపర్ మార్కెట్ వ్యాపారి రూ.రెండు కోట్లకు పైగా అప్పులు చేసి కుచ్చుటోపి పెట్టి ఐపీతో పరారయ్యాడు. కామారెడ్డికి చెందిన అబీబ్ జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలో మెగా మార్ట్ సూపర్ మార్కెట్ పేరుతో గత ఆరు సంవత్సరాల క్రితం సూపర్ మార్కెట్‌ను నెలకొల్పాడు.

అబీబ్ పలువురి వద్ద రూ.రెండు కోట్లకు పైగా అప్పులు చెసి నెల నెల వడ్డీలు చెల్లిస్తూ నమ్మకాన్ని కలిగించాడు. అలాగే సూపర్ మార్కెట్‌కు కావాల్సిన వస్తువులను డిస్ట్రిబ్యూటర్ల వద్ద తీసుకొని ది  డబ్బులు చెల్లించేవాడు. గత మూడు నెలలుగా సూపర్‌మార్కెట్ నడవడం లే  అప్పు ఇచ్చిన వారికి ఎంతో కొంత ఇస్తూ వస్తున్నాడు.

ఇప్పుడు అప్పు ఇచ్చిన వారికి ఐపి పెటి బిచానా ఎత్తేశాడు. గత 20 రోజులు మెగా సూపర్ మార్కెట్ తెరువకపోవడంతో డిస్ట్రిబ్యూటర్లు, అప్పులు ఇచ్చిన వారు ఆందోళన చెందుతున్నారు. డబ్బులు ఇ  వారికి ఐపి నోటీసులను పంపడంతో అబీబ్ అసలు రంగు బయటపడింది. తమను నమ్మించి తమకే టోకరా పెట్టాడని అ  ఇచ్చిన వారు లబోదిబోమంటున్నారు.

అబీబ్ తన కుటుంబంతో పాటు ఆజ్ఞాతంలోకి వెళ్లాడు. వ్యాపార సంఘం నేత సు  పోలీసులకు సమాచా  అందించారు. శనివారం పోలీసులతో వ  మెగా మార్ట్ తాళాలు తీయగా అందులోని ఫర్నిచర్‌తో పాటు విలువైన వస్తువులు కనిపించలేదు.

పథకం ప్రకారమే సూపర్ మా   వ్యాపారి అబీబ్ కుచ్చుటోపీ పెట్టి వెళ్లాడని డిస్ట్రిడ్యూటర్లు ఆవేదన వ్యక్తం చే  20 రోజుల క్రితమే అబీబ్ దుకాణంలో ఉ  వస్తువులతో పాటు ఉడా   తెలుస్తోంది. అబీబ్ తన షాపులో నె  వేతనంపై పని చేసిన ఓ మహిళ కార్మికురాలికి చెందిన రెండు తులాల బం  సైతం అప్పుగా తీసుకున్నట్టు తెలుస్తున్నది.