హైదరాబాద్, జులై 2 (విజయక్రాంతి): భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. దక్షిణాఫ్రికాతో ముగిసిన ఏకైక టెస్టులో భారీ సెంచరీతో కదంతొక్కిన స్మృతి.. మంగళవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొంది. ఈ సందర్భంగా టీటీడీ ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. రంగానాయకులు మండపంలో స్మృతికి పండితులు స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందచేశారు.