ఇదొక ఫ్యాషన్ ప్రపంచం.. ఎప్పటికపుడూ ట్రెండ్ మారుతూ ఉంటుంది. ఫ్యాషన్ ఎంత మారినా.. ఆనాటి వస్తువుల తాలుకూ జ్ఞాపకాలు మాత్రం మదిలో పదిలంగా ఉంటాయి. మన అమ్మమ్మ.. నానమ్మ వాళ్లింట్లో కనిపించే పాతకాలపు కుట్టుమిషన్స్ ఎప్పుడన్నా చూశారా.. వాటిని చూసిన వెంటనే.. ఎన్నో ఆలోచనలు బుర్రలో గుర్రున తిరుగుతాయి. ఈ ఆధునిక యుగంలో కుట్టు మిషన్ లేని జీవితాన్ని ఊహించగలమా? మొదట్లో కుట్టుపని అంతా చేతులతోనే జరిగేది. అలా ఎంతసేపు కుడతాం? ఎన్ని బట్టలని కుడతాం? అందుకే ఐజాక్ మెరిట్ సింగర్ దీని రూపకర్త. సింగర్ కన్నా ముందు కుట్టుమిషన్‌ను ఎలియాస్ హోవే అనే అమెరికన్ కనిపిపెట్టాడు. కానీ ఆధునిక పద్ధతుల్లో నేటి పరిస్థితులకు అనుగుణంగా కుట్టుమిషన్‌ను చేసిపెట్టింది మాత్రం సింగరే అని చెప్పొచ్చు.