calender_icon.png 27 November, 2024 | 7:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసుల ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు

27-11-2024 05:22:15 PM

ఏజెన్సీ ప్రజలకు పోలీసులు ఎల్లప్పుడూ అండగా ఉంటారు : డిఎస్పీ చంద్రభాను

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): ఏజెన్సీ ప్రాంత ప్రజలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఇల్లందు డిఎస్పి చంద్రభాను అన్నారు. ఈ రోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు బుధవారం కొమరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని శెట్టిపల్లి ఆదీవాసి గ్రామంలో నివసించే గ్రామస్తులకు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారుగా గ్రామస్తులు 100 మంది పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇల్లందు డిఎస్పి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏజెన్సీ గ్రామాల్లో నివసించే ఆదివాసీ ప్రజలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. గ్రామంలో ఎలాంటి సమస్యలున్న వెంటనే పోలీసువారి దృష్టికి తీసుకురావాలని తెలిపారు. వాతావరణంలో మార్పుల కారణంగా దోమల వలన విష జ్వరాలు ప్రభలే అవకాశం ఉన్నందున జిల్లా ఎస్పీ గారి ఆదేశాలతో ఏజెన్సీ గ్రామాలలో ఇలాంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేశారు. అనంతరం ఈ వైద్య శిబిరంలో పాల్గొని గ్రామస్తులకు వైద్య సేవలు అందించిన వైద్యులకు కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో గుండాల సీఐ రవీందర్, కొమరారం ఎస్సై సోమేశ్వర్, సిబ్బంది పాల్గొన్నారు.